Site icon Mana Prajapaksham

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేసేలా అధికారులు చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ సోమవారం నాగర్ కర్నూల్ మండల పరిధిలోని తూడుకుర్తి గ్రామాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న ఇందిరమ్మ గృహ నిర్మాణ పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు పాండు నిర్మిస్తున్న ఇంటి వద్ద పనుల పురోగతిని పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి గురించి కలెక్టర్ అధికారులు ను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ గ్రామంలోని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుంటూ, మొత్తం ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయి, ఇప్పటివరకు ఎన్ని ఇండ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి, వాటి పురోగతి ఏ దశలో ఉంది అనే వివరాలను సేకరించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల మేరకు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేసిందని, లబ్ధిదారులు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచిస్తూ, ఆలస్యం చేయకుండా సమయానికి ఇండ్లను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. అలాగే ప్రతి దశలో పనుల పురోగతిని ఆన్‌లైన్‌లో నమోదు చేయడం తప్పనిసరి అని అధికారులను ఆదేశించారు. దీనివల్ల లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం నుండి అవసరమైన నిధులు దశలవారీగా విడుదలవుతాయని తెలిపారు. నిర్మాణ పనుల పురోగతి వారిగా ఆన్లైన్లో నమోదు చేసి, లబ్ధిదారులకు నిర్మాణ పనుల స్థాయిల వారిగా ప్రభుత్వం నుండి డబ్బులు విడుదలయ్యేలా చూడాలని కలెక్టర్ అధికారులు ఆదేశించారు. ఇప్పటివరకు నిర్మాణ పనులకు అయినా ఖర్చు వివరాలను ఇంటి యజమానిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇల్లు మంజూరు అయిన లబ్ధిదారులు అందరూ నిర్మాణాలు చేపట్టేలా క్షేత్రస్థాయిలో పక్కాగా పర్యవేక్షణ జరపాలన్నారు. గ్రామంలో ప్రతి లబ్ధిదారుడు నాణ్యతతో గృహాన్ని నిర్మించుకోవడానికి ప్రభుత్వ సహకారం అందుతుందని, అధికారులు తరచూ పరిశీలనలు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

Exit mobile version