మన ప్రజాపక్షం డెస్క్ :హర్యానా రాజధాని చండీగఢ్ లో సీనియర్ ఐపీఎస్ అధికారి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. అడిషనల్ డీజీపీగా ఉన్న పురాణ్ కుమార్… నిజాయితీ, నిబద్ధత గల అధికారిగా పురాణ్ కుమార్ కు మంచి పేరు ఉండటంతో ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారా? లేక మరేదైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పురాణ్ కుమార్ మొబైల్, పలు వస్తువులను పరిశీలిస్తున్నారు దర్యాప్తు అధికారులు.
సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య



