నిర్మల్, మన ప్రజాపక్షం :నిర్మల్ జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ 22 సోమవారం నాడు నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం, వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక ప్రజావాణి మళ్లీ నిర్వహించనున్నట్లు కలెక్టర్ అభిలాష్ అభినవ్ స్పష్టం చేశారు. అత్యవసర సమస్యలపై సంబంధిత శాఖాధికారులను నేరుగా సంప్రదించాలని సూచించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, వర్షాలు కొనసాగుతున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అభిలాష్ అభినవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజావాణి రద్దు




