
ఆమనగల్లు, (మన ప్రజాపక్షం): ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా నల్లబెల్లం ఎవరు తరలించిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆమనగల్లు ఎక్సైజ్ సీఐ బధ్యనాధ్ చౌహన్ హెచ్చరించారు. దసరా పండగ సందర్బంగా ఆదివారం ఉదయం ఆమనగల్లు బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించగా హైదరాబాద్ నుండి అక్రమంగా తెచ్చిన 150 కిలోల నల్లబెల్లం, ఆర్ఎస్ బెల్లం ముద్దలు, విప్ప పువ్వులతో అనుమానస్పదంగా తిరుగుతున్న ఎల్లమ్మ అనే మహిళను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. సందర్భంగా సీఐ మాట్లాడుతూ పండుగ సందర్భంగా ఎవరైనా సారాయి తయారుచేసిన, అమ్మిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫంక్షన్ హాల్స్, ఫామ్ హౌస్ లలో మద్యం సేవించినా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ బాలరాజ్, సిబ్బంది సురేష్, శ్రీను, శ్రీజ ఇతరులు పాల్గొన్నారు.