Site icon Mana Prajapaksham

ఘనంగా పోషణ మాసం, సెప్టెంబర్ -2025

సూర్యాపేట, మన ప్రజాపక్షం :మనం తీకునే ఆహారంలో నూనెలు,చెక్కరలు అలాగే ఉప్పు సరిపోను మోతాదులో- ఉపయోగించటం ద్వారా ఆరోగ్యం కాపాడుకోవచ్చని జిల్లా సంక్షేమ అధికారి దయానందరాణి పిల్లలు, కిషోర్ బాలికలు, గర్భిణీలు అలాగే బాలింతలకు సూచించారు. పోషణ మాసం – 2025 కార్యక్రమంలో భాగంగా పోషకహార లోపం, ఒబేసిటీ గురించి సూర్యాపేట పట్టణం అంబేద్కర్ నగర్ 1 అంగన్వాడి లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రోజువారి ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు ముఖ్యంగా మునగ ఆకు మనం తీసుకోవడం వలన రక్తహీనత బారిన పడకుండా ఉంటామని,కిషోర్ బాలికలకు తినుభండారాలైన చాక్లెట్స్, బిస్కెట్ మరియు ఇతర నూనెలో అధికంగా వేయించిన వాటికి బదులుగా ప్రతిరోజు పల్లిపట్టి, నువ్వుల లడ్డు ఇవ్వాలని చెప్పారు. ఆరు సంవత్సరాలలోపు పిల్లలందరికీ ప్రతినెల బరువులు, ఎత్తులు పరిశీలించి వారి పోషణ స్థాయి ఏ విధంగా ఉందో తల్లిదండ్రులకి తెలుసుకొనేలా చేసి వారి పోషణ లోపంకు గురికాకుండా చూసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version