Site icon Mana Prajapaksham

శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 3.36 కోట్ల బంగారం పట్టివేత

హైదరాబాద్, మన ప్రజాపక్షం : హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు విమానశ్రయంలో 3.38 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐరన్ బాక్స్ లో బంగారాన్ని దాచి తరలిస్తున్న ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ. 3.36 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ బంగారాన్ని దుబాయ్ నుంచి తీసుకువచ్చినట్లు అనుమానిస్తున్నారు. బంగారం తరలింపునకు సంబంధించి సరైన దృవపత్రాలు లేవని అధికారులు స్పష్టం చేశారు.

Exit mobile version