పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం

ఉప్పునుంతల, మన ప్రజాపక్షం : ఉప్పునుంతల మండల పరిధిలోని మామిళ్ళపల్లి గ్రామంలో జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అచ్చంపేట నియోజకవర్గంలో పాడి ఉత్పత్తి పెరుగుదలకై తగు చర్యలు తీసుకుంటున్నట్టు చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. ఉప్పునుంతల మండలంలోని మామిళ్ళపల్లి గ్రామంలో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని గాలికుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుటకు రాష్ట్ర ప్రభుత్వ ఉచిత గాలికుంటువ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారాలతో ఆజాద్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం నేటి నుండి నెలరోజుల పాటు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోందని,రైతులు ఈ శిబిరాలని సద్వినియోగపరుచుకోవాలని వారు కోరారు. రైతులు వ్యవసాయంతో పాటు అనుబంధరంగాలైన పాడి పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ, గొర్రెల పెంపకం, పందుల పెంపుపై దృష్టి సారించి లాభాలు గడించాలని పేర్కొన్నారు,నియోజకవర్గంలో నల్లమల తూర్పుపొడ జాతి సంక్షణ అభివృద్ధికై పరిశోదాన కేంద్ర ఏర్పాటుపై హమి ఇచ్చారు. అదే విధంగా నియోజకవర్గంలో పశు వైద్య పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు సంబంధిత మంత్రితో చర్చలు జరుపుతున్నామని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలియజేశారు. పాడి ఉత్త్పతిని గణనీయంగా పెంచుటకు ఉప్పునుంతల మండలంలో పైలట్ ప్రాజెక్ట్ కింద పశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, గ్రామ లక్ష్మి నరసింహస్వామి దేవాలయ చైర్మన్ వేముల సంసింహరావు, జిల్లా పశువైద్య & పశు వంవర్ధక శాఖ అధికారి డా. బి. జ్ఞానశేఖర్, మండల పార్టీ అధ్యక్షులు కట్ట అనంత రెడ్డి, మాజీ ఎంపీపీ తిప్పర్తి నరసింహరెడ్డి, కాలువ గోవర్ధన్ రెడ్డి, మొగులాన్ గౌడ్, పశువైధ్యాదికారులు డా. జి. ప్రవీణ్ కుమార్, డా. పి. వెంకటేశ్వర్లు, డా. బిచ్చామ్మ, డా. మహేశ్వరి, సిబ్బంది శ్రీను, కుమార్, వెంకటయ్య, మిరాజ్, హబిబ్, గోపాలమిత్ర సూపర్వైజర్ మురళీధర్ రెడ్డి మరియు గ్రామ పాడి రైతులు పాల్గొన్నారు.

Mana Praja Paksham Desk
Mana Praja Paksham Desk
Articles: 224

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *