Site icon Mana Prajapaksham

సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం సమావేశానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ

కొత్తగూడెం, మన ప్రహజాపక్షం :కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ పీవీకే 5 గని ఆవరణలో జరిగిన సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సమావేశానికి ఆ సంఘం గౌరవాధ్యక్షుడు మరియు మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత అగ్రికల్చర్ మరియు రైతు సంక్షేమ కమిషన్ మెంబర్ అయినటువంటి సభావత్ రాములు నాయక్ హైదరాబాదు నుంచి వచ్చి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శుక్రవారం రాత్రి పొద్దు పోయాక జరిగినటువంటి ఈ సమావేశంలో సింగరేణిలో గిరిజన ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యల మీద కూలంకష చర్చ జరిగింది. ఈ చర్చలో రాములు నాయక్ తో పాటు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోళ్ల రమేష్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్యా కృష్ణమూర్తి కూడా పాల్గొన్నారు. సంఘం కేంద్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన బానోత్ సాయి పవన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలులో గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అనేకమంది వక్తలు రాములు నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా కొత్తగూడెం ఏరియా ప్రెసిడెంట్ కాక నరసింహ, జనరల్ సెక్రెటరీ సీతారాం నాయక్ అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ నాగేశ్వరరావు మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా కష్టంతో కూడుకున్న పనులను గిరిజన ఉద్యోగులకు కేటాయిస్తూ తేలికైన పనులను మరియు సర్ఫేస్ పనులను ఇతర ఉన్నత వర్గాల వారికి కేటాయించడాన్ని రాములు నాయక్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనికి స్పందించిన రాములు నాయక్ అతి త్వరలో గిరిజన సమస్యల మీద నేషనల్ కమిషన్ తోను స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ తోను అదే విధంగా గిరిజన శాఖ మంత్రితో కూడా రివ్యూ చేపించి తగు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు.  ఇదే సమావేశంలో అనుకోని అతిథిగా తెలంగాణ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ హాజరై సింగరేణి గిరిజన ఉద్యోగులకు తమ మద్దతును తెలియజేశారు.

Exit mobile version