విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా జిల్లాస్థాయి టీఎల్ఎం మేళా

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :టీఎల్ఎం మేళాతో విద్యార్థులకు సులభతరంగా బోధన చేయడానికి అవకాశం ఉంటుందని, అధ్యాపకుల బోధనా నైపుణ్యాలను మెరుగుపరిచే దిశగా తరగతి గదిలో టిఎల్ఎం ఒక దిక్సూచిగా పనిచేసి, కొత్త ఆవిష్కరణలకు నాంది పడుతుందని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రమేష్ కుమార్ అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి టీఎల్ఎం (టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) మేళా అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ మాట్లాడుతూ తరగతి గదిలో విద్యాబోధనకు టీఎల్ఎం కొత్త ఆవిష్కరణలకు దిక్సూచిగా పనిచేస్తుందని, తరగతి గదిలో టిఎల్ఎం అత్యంత అవసరమన్నారు. రెడీమేడ్గా కాకుండా ఉపాధ్యాయులు సొంతంగా తయారు చేసిన టీఎల్ఎంలను ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికై న టీఎల్ఎలకు సృజనాత్మకత జోడించి ప్రదర్శించాలన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయికి ఎంపికై న ప్రదర్శనలను రూపొందిన ఉపాధ్యాయ మెమొంటోలను అందజేశారు. అంతకుమందు సెక్టోరియల్ అధికారులు, కిరణ్ కుమార్, శోభారాణి, మండల విద్యాధికారులు మేళాను పారంభించారు. జిల్లాలోని 20 మండలాల నుంచి మొత్తం జిల్లా స్థాయిలో టీఎల్ఎం మేళా 200 ప్రదర్శనలను ప్రదర్శించారు. నాలుగు విభాగాల నుంచి 8 ప్రదర్శనలు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. ఇంగ్లిష్ విభాగంలో భాగ్యలక్ష్మి (ప్రాథమిక పాఠశాల కారుకొండ, బిజినపల్లి మండలం), ఎం.శ్రీలక్ష్మి (ప్రాథమికోన్నత పాఠశాల లక్ష్మాపూర్, అచ్చంపేట మండలం), తెలుగు విభాగంలో చంద్రకళ(ప్రాథమికోన్నత పాఠశాల వరదల కొల్లాపూర్ మండలం, పి.అనిల్ (ప్రాథమికోన్నత పాఠశాల అప్పాయిపల్లి, లింగాల మండలం), గణితం విభాగంలో కే.ఎల్లయ్య (ప్రాథమిక పాఠశాల అమ్రాబాద్, అమ్రాబాద్ మండలం),ఎస్.బ్రహ్మచారి (ప్రాథమిక పాఠశాల, ముష్టిపల్లి, పెద్దకొత్తపల్లి మండలం), ఎన్విరాన్మెంట్ సైన్స్ విభాగంలో జే. మోతి భాయ్ (ప్రాథమికోన్నత పాఠశాల ఇప్పలపల్లి, పదరా మండలం), జే.వేణు ప్రాథమిక పాఠశాల గౌరారం, బిజినపల్లి మండలం ఎంపికయ్యాయి. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు కిరణ్ కుమార్, నూరుద్దీన్, శోభారాణి, మురళీధర్ రెడ్డి, జిల్లా టెస్ట్ బుక్ మేనేజర్ నరసింహులు, గణాంక అధికారి మధుసూదన్ రెడ్డి, కార్యక్రమానికి వ్యాఖ్యాతిగా వ్యవహరించిన ఉపాధ్యాయుడు కవి గుడిపల్లి నిరంజన్, వెంకటేశ్వర శెట్టి, కార్యాలయ పర్యవేక్షకులు నాగేందర్, వివిధ మండల విద్యాధికారులు, ఉపాధ్యాయులు, జిల్లాలోని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Mana Praja Paksham Desk
Mana Praja Paksham Desk
Articles: 224

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *