హనుమకొండ, మన ప్రజాపక్షం :రూ.4 కోట్ల బిల్లులు ఇవ్వడం లేదని హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రానికి కాంట్రాక్టర్ శ్రీకాంత్ రెడ్డి తాళం వేసాడు. అయితే ఏడాది క్రితం కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. నేటి నుండి రెండు రోజుల పాటు కాళోజీ కళాక్షేత్రంలో కాకతీయ నృత్య నాటకోత్సవ కార్యక్రమాలు జరుగనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సహా పలువురు మంత్రులు హాజరు కానున్నారు. అయితే మంత్రులు, అధికారులు కార్యక్రమం కోసం వెళ్లగా, తాళం వేసి ఉండడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు అధికారులు. అయితే కార్యక్రమాలు జరగకుండా తాళం వేసినందుకు కాంట్రాక్టర్ శ్రీకాంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పెండింగ్ బిల్లులు చెల్లించలేదని కాళోజీ కళాక్షేత్రానికి తాళం వేసిన కాంట్రాక్టర్




