మన ప్రజాపక్షం డెస్క్ : తెలంగాణ రాష్ట్ర మత్స్య పరిశ్రామిక సహకార సంఘాల రాష్ట్ర కార్యదర్శి బాయ వెంకటస్వామి రాష్ట్ర ప్రజలకు, మహిళా మణులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళామణులు ఎంతో ఇష్టంగా రంగు రంగుల పూలతో బతుకమ్మలను చేసి ఆట,పాటలతో నిర్వహించే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక అని తెలియజేస్తూ, ప్రజలందరూ కుటుంబ సమేతంగా ఆనందోత్సవాల మధ్య బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరారు. ప్రజాపాలనలలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న మన తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సంబరాలు జరపడం ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుందని అన్నారు. చిన్న పెద్ద తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో, సోదరభావంతో బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు.
రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన బాయ వెంకటస్వామి




