జనగామ, మన ప్రజాపక్షం : ఎస్టీ జాబితా నుండి లంబాడిలను తొలగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మరియు సోయం బాబురావు చేస్తున్న కుట్రపూరిత రాజకీయాలకు నిరసనగా హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర ఎల్-జెయేసి ఆధ్వర్యంలో లంబాడిలా ఆత్మగౌరవ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో లంబాడిలు వలసవాదులు కాదు మూలవాసులం అని రాష్ట్ర వ్యాప్తంగా లంబాడిలు అందరూ ఏకమై నిరసన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్జెఎసి జనగామ జిల్లా కన్వీనర్లు కొర్ర రాజేందర్ నాయక్, బిక్షపతి నాయక్, రఘునాథపల్లి ఎల్హెచ్పిఎస్ నాయకులు సంతోష్ నాయక్, కృష్ణ నాయక్, మల్లేష్ నాయక్, చంద్రశేఖర్ నాయక్, మహేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
బంజారాల ఆత్మగౌరవ నిరసన సభకు తరలిన బంజార నాయకులు




