మహబూబ్ నగర్, మన ప్రజాపక్షం : అంబేద్కర్ కళాభావనం ఆవరణలో ఉర్దూఘర్ వద్దు కలభవన్ ముద్దు ఈ స్థలం రక్షిo చుకొందాం! అనే ఈ అంశంపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాభవనం పరిరక్షణ కమిటీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్సి, ఎస్టీ, బీసీ దళిత బహుజన ప్రజా సంఘాల ప్రతినిధులుఅందరు ముక్త కంఠంతో ఖండిస్తూ అంబేద్కర్ కళాభవన్ అందరికీ, అన్ని కార్యక్రమాలకి ఆమోదయోగంగా ఉన్న ప్రభుత్వం ఆధీనంలో ఉన్న అంబేద్కర్ కళాభవనం స్థలంలో ఒక ఉర్దూ ఘరే కాదు భవిష్యత్తులో ఇతర ఏవైనా మతపరమైన నిర్మాణాలను చేపట్టొద్దని వివరించి తెలియజేస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మారేపల్లి సురేందర్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. మేము కూడా ఎమ్మెల్యే మిగతా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో చర్చించి తెలియజేస్తూ మీ సమస్య న్యాయపరంగా ఉంది కాబట్టి సంపూర్ణ మద్దతు మీకు ఎల్లవేళలా ఉంటుందని తెలియజేశారు. డాక్టర్ అంబేద్కర్ కళాభవన్ పరిరక్షణ సమితి చైర్మన్ సింగిరెడ్డి పరమేశ్వర్, కన్వీనర్ పాతూరి రమేష్, కో కన్వీనర్ ఎర్ర నరసింహ బిసి ముదిరాజు నాయకులు మురళి, దళిత నాయకుడు సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.
మారేపల్లి సురేందర్ రెడ్డిని కలిసిన అంబేద్కర్ కళాభవనం పరిరక్షణ సమితి కమిటీ




