Site icon Mana Prajapaksham

ఆదివాసి మహిళపై పాల్వంచకు చెందిన కేటీపీఎస్ ఉద్యోగి అత్యాచారయత్నం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామపంచాయతీలోని సోయంగంగుల గూడెంలో ఈనెల 03వ తారీకు శుక్రవారం రాత్రి సమయంలో పాల్వంచకు చెందిన కేటీపీఎస్ ఉద్యోగి ఆదివాసి మహిళపై అత్యాచారానికి ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ కేటీపీఎస్ ఉద్యోగిపై 04 వ తారీఖు శనివారం బాధితురాలు తరపున స్థానిక ములకలపల్లి పోలీస్ స్టేషన్లో ఆ గ్రామ మహిళలందరూ కలిసి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామ పంచాయితీ సోయం గంగుల గూడెంలో  గ్రామస్తులు నిద్రిస్తున్న సమయంలో పాల్వంచకు చెందిన కేటీపీఎస్ ఉద్యోగి అర్ధరాత్రి 12 గంటల సమయంలో బాధిత మహిళను అత్యాచారయత్నం చేయబోయాడు. ఇంతలో ఆ మహిళ కేకలు వేయడంతో చుట్టుప్రక్కల ఇండ్లలోని వారు అక్కడ చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు వేసుకొని వచ్చిన స్కూటీని అక్కడే వదిలేసి పారిపోయాడని బాధితురాలు, చుట్టుపక్కల మహిళలు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Exit mobile version