Site icon Mana Prajapaksham

మా ఎంగిలి తిని బతికే మీకు పూజకు అర్హత లేదు?

తెల్కపల్లి, మన ప్రజాపక్షం :మా ఎంగిలి తినే బతుకే మాలలు అని కులం పేరుతో దూషించి దుర్గమాత దగ్గరికి వచ్చే అర్హత మీకు లేదంటూ గుడిలోకి రాకుండా అవమానపరిచిన యాదవులు, నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలంలోని జంగమోనిపల్లి (జంగమయపల్లి ) గ్రామంలో చోటుచేసుకుంది. ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా సమతా సైనిక్ దళ్, మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జంగమోనిపల్లి గ్రామానికి వెళ్లి వారితో మాట్లాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కూన గోవర్ధన్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినా ఇంకా ఈ కుల వ్యవస్థ పోలేదు సాటి మానవులను మానవులుగా గుర్తించడం లేదు అంటూ ఈ ఘటన అందరికీ అవమానకరం అని అన్నారు. సమతా సైనిక్ దళ్ జిల్లా ఇంచార్జ రమేష్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా దళితులపై దాడులు అవమానాలు ఇంకా ఏటేటా పెరుగుతా ఉన్నాయి కానీ తగ్గడం లేదు జంగమోనిపల్లిలోని యూత్ అసోసియేషన్ సభ్యులు దుర్గామాత విగ్రహం ఏర్పాటుచేసిన సందర్భంగా మాలలు పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తే మేము తినే ఎంగిలి తిని బతికే నీకు పూజించే, గుళ్లోకి వచ్చే అర్హత లేదంటూ కులం పేరుతో దూషిస్తూ అవమానపరిచిన యూత్ అసోసియేషన్ సభ్యుల పైన ఏసి ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని, జంగమోనిపల్లిలో దళితులపై జరిగిన ఈ అవమాన ఘటనపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, గ్రామాన్ని సందర్శించి విచారణ జరిపి దోశలపైన కఠిన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో దళితులపైన ఇలాంటి దాడులు జరగకుండా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో జయన్న, రిటైర్ ప్రిన్సిపల్ కృష్ణయ్య, కోటేష్, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version