ఎమ్మెల్యే యెన్నెం
మహబూబ్ నగర్, మన ప్రజాపక్షం : మహిళలను కోటీశ్వరులను చేస్తాం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ఎంప్లాయీస్ కాలనీ 20 వార్డులో 22 లక్షల రూపాయల ముడా నిధులతో నూతనంగా నిర్మించనున్న మహిళా సంఘాల భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళా సంఘాలను నిర్విర్యం చేసే ప్రయత్నం చేశారని ఆయన మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో పావలా వడ్డీ బకాయిలు విడుదల చేశామని ఆయన గుర్తు చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని పది ఏండ్లు ఆశ చూపించి ఆగం చేసారన్నారు. కానీ ప్రజా ప్రభుత్వంలో ఇల్లు లేని ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని, సంవత్సరానికి ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామన్నారు. కనీసం 50 గజాల సొంత ఇంటి స్థలం ఉన్న అందరికీ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. మహిళలలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణాలు కల్పించడమే కాకుండా, ఆర్టీసీ బస్ లకే యజమానులను కూడా చేశామన్నారు. ఏ పథకం మైనా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు అంజద్ ఖాజా పాషా, రాషెద్ ఖాన్, నాయకులు అవేజ్, సంజీవరెడ్డి, అర్షద్, కిషన్ నాయక్, రమేష్ రెడ్డి, చర్ల శ్రీనివాసులు, వివిధ మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మహిళలను కోటీశ్వరులను చేస్తాం