Site icon Mana Prajapaksham

దేవరకద్ర నియోజకవర్గ  ప్రజలకి విజయదశమి శుభాకాంక్షలు

భూత్పూర్, మన ప్రజాపక్షం :దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండల కేంద్రం, పట్టణ, పరిసర గ్రామ ప్రాంతాల వారికి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఈ విజయదశమి అందరికీ విజయం చేకూర్చాలని,కనకదుర్గ అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలు చేపట్టిన అన్ని పనులలో విజయం చేకూరాలని, అందరికీ కూడా సకల విజయాలు కలిగించాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతున్నామని వారు పేర్కొన్నారు. విజయదశమి పండుగను పురస్కరించుకొని తన సొంత గ్రామమైన అన్నాసాగర్ లో గల ప్రధాన ఆంజనేయ దేవాలయంలో జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి, తదనంతరం గ్రామ ప్రజలతో దేవాలయంలోని వివిధ విగ్రహమూర్తులకు పూజలు నిర్వహించారు. తదనంతరం గ్రామ ప్రజలతో కలిసి ఈ పండుగను నిర్వహించుకున్నారు.

Exit mobile version