అచ్చంపేట, మన ప్రజాపక్షం :అచ్చంపేట వినాయకనగర్ లో గల ఎస్.ఏ.వి గుప్త ఓల్డ్ ఏజ్ హోమ్ లో గల వృద్ధులకు భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా & అచ్చంపేట డివిజన్ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు,బ్రెడ్డు పంపిణీ చేయడం జరిగిందని,అనంతరం మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందని అధ్యక్షులు భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఏ. వి గుప్తా ఎడ్యుకేషనల్ సొసైటీ జనరల్ సెక్రటరీ సంధ్యారాణి, పాషా, అజహర్, క్రాంతి కుమార్, రంజిత్,శరీన్, చంద్రయ్య, రామస్వామి,జైపాల్, గొపాల్,రేణు తదితరులు పాల్గొన్నారు.
గాంధీ జయంతి రోజు వృద్ధాశ్రమంలో పండ్లు, బ్రెడ్డు పంపిణి చేసిన టిపిటిఎఫ్ సభ్యులు




