నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం ప్రతినిధి :ఎంఆర్పిఎస్ వ్వవస్థాపక జాతీయ అధ్యక్షులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నూతన జిల్లా కమిటీల నియామకం చేపట్టారు. అయితే నాగర్ కర్నూల్ జిల్లా నూతన అధ్యక్షుడిగా జిల్లాలోని ఊర్కొండ మండలం గుడిగానిపల్లి గ్రామానికి చెందిన టైగర్ రాజు మాదిగను నియమించినట్టు నాగర్ కర్నూల్ జిల్లా ఇన్చార్జి ఆడెపు నాగార్జున మాదిగ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్బంగా ఆడెపు నాగర్జున మాదిగ మాట్లాడుతూ టైగర్ రాజు మాదిగ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ చేపట్టిన కార్యక్రమాలు, ఇతరత్రా అంశాలలో చురుకగా వ్యవహరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారని ఆయన తెలిపారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ దాదాపు 20 సంవత్సరాల నుండి క్రియాశీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, రైతు సమస్యలు, విద్యార్థుల సమస్యలు ఆ చెప్పుకుంటూ పోతే అనేక అంశాలపై పోరాడిన చరిత్ర టైగర్ రాజుదని ఆయన తెలిపారు. అదేవిధంగా నాగర్ కర్నూల్ జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన టైగర్ రాజు మాదిగ మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో బడుగు, బలహీన వర్గాలు, పేదల కోసం పనిచేయడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. ఎమ్మార్పీఎస్ పోరాటంలో, ఎమ్మార్పీఎస్ ఏ క్షణం ఏ రోజు ఏ పోరాటానికి పిలిపిచ్చినా నా వంతుగా పోరాటంలో కీలక పాత్ర పోషిస్తానని అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాలు, ప్రజా సంఘాలు మేధావులను అందర్నీ కలుపుకుపోయి జిల్లాలో ఎమ్మార్పీఎస్ బలోపేతానికి నా వంతుగా కృషి చేస్తానని అన్నారు. జిల్లాలో ఏ ఒక్కరికి ఏ ఆపద వచ్చినా నా వంతు పాత్ర కచ్చితంగా ఉంటుందని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా నా నియామకానికి సహకరించిన జిల్లా నాయకులకు అదే విధంగా రాష్ట్రం నాయకులకు ముఖ్యంగా మందకృష్ణ మాదిగ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టైగర్ రాజు మాదిగకు జిల్లా నూతన అధ్యక్షుడిగా జిల్లా ఇన్చార్జీలు ఆడెపు నాగార్జున మాదిగ, మద్దిలేటి మాదిగల చేతుల మీదుగా నియామక పత్రాన్ని తీసుకోవడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఎమ్మార్పీఎస్ లో పనిచేస్తున్న ప్రతి నాయకుడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ పాత్రికేయుల సమావేశంలో జిల్లా నూతనంగా ఎన్నికైన అధికారప్రతినిధి కర్నె పరమేష్ మాదిగ, ప్రధాన కార్యదర్శులు సిద్దులు మాదిగ, కుర్మయ్య మాదిగ, ఉపాధ్యక్షులు ఆంజనేయులు మాదిగ, లక్ష్మణ్ మాదిగ కార్యదర్శులు కొయ్యల వెంకటేష్ మాదిగ, పరమేష్ మాదిగ ప్రచార కార్యదర్శి శ్రీనివాసులు మాదిగ, జిల్లా సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎంఅర్పిఎస్ కందనూలు జిల్లా నూతన అధ్యక్షుడిగా టైగర్ రాజు మాదిగ




