మన్ననూర్, మన ప్రజాపక్షం :మన్నానూర్ ఐటీడీఏ కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తున్న గిరిజన ఆశ్రమ పాఠశాల డైలీ వేజ్ వర్కర్ల తమ సమస్యలు పరిష్కరించాలని నేటికీ 34 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తూ అందులోనే భాగంగా గత మూడు రోజులుగా 72 గంటలపాటు మన్ననూర్ ఐటిడిఏ కార్యాలయం ముందు సమ్మెకు దిగిన డైలీ వేజ్ వర్కర్లకు తెలంగాణ గిరిజన సంఘం సంపూర్ణ మద్దతును ప్రకటించింది.ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు కాట్రావత్ రవి నాయక్ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జర్పుల శివ ప్రచండ మన్ననూర్ ఐటిడిఏ కార్యాలయం ముందు జరుగుతున్న సమ్మెలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు ఈ సమ్మె వల్ల చదువుకు ఆటంకం అవుతుందని వారి చదువు సాఫీగా జరగాలంటే వెంటనే ప్రభుత్వం స్పందించి హాస్టల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారి న్యాయమైన డిమాండ్ అయిన టైం స్కేల్ మరియు 64 జీవోను రద్దు చేయాలని వారికి సంబంధించిన బెనిఫిట్స్ అందజేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంగిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లు చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హాస్టల్ వర్కర్ల సమస్యలను పరిష్కరించి వారికి తగు న్యాయం చేయాలని చేయాలని తెలిపారు.
గిరిజన ఆశ్రమ పాఠశాల డైలీ వేజ్ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి