Site icon Mana Prajapaksham

ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన విద్యార్థులు

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం : ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ మండలం వనపట్ల గ్రామంలోని అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదేశాను ప్రకారం విద్యార్థులను ఉద్దేశించి అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు పలు సలహాలు సూచనలు చేశారు. చదువుతో పాటు క్రమశిక్షణ, దేశం పట్ల గౌరవం కలిగి ఉండాల్సిన ఆవశ్యకతను వివరించారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన కార్యాలయాలను చూపించి వాటి విధులు, పనితీరును అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు స్వయంగా విద్యార్థులకు వివరించారు.

Exit mobile version