Site icon Mana Prajapaksham

ప్రేమ పేరుతో వేధింపులు.. విద్యార్థిని ఆత్మహత్య

మంచిర్యాల, మన ప్రజాపక్షం :మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం పెద్దపేటకు చెందిన బొడ్డు ఐశ్వర్య (17) అనే ఇంటర్ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అయితే ప్రేమ పేరుతో అజయ్ అనే విద్యార్థి కొంతకాలంగా వేధిస్తున్నాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్ 24న కాలేజీ ఫంక్షన్‌లో అజయ్ ఆమెను కొట్టాడని, దీంతో మనస్తాపం చెందిన బాలిక అవమానంతో ఆత్మహత్య చేసుకుందన్నారు. ఐశ్వర్య తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version