Site icon Mana Prajapaksham

ప్రణాళిక ప్రకారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాలి

జనగామ, మన ప్రజాపక్షం :శుక్రవారం ఎన్నికల సంఘం కార్యాలయం నుండి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో అదనపు సీఈఓ లోకేష్ కుమార్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం ఓటరు జాభితాపై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాలని అన్నారు. ఎస్.ఐ.ఆర్ నిర్వహణ కంటే ముందు ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో 2002 ఎస్.ఐ.ఆర్ డేటా ను 2025 ఎస్.ఎస్.ఆర్ డేటాతో పరిశీలన చేసుకోవాలని తెలిపారు. ఈ రెండు జాబితాలో కామన్ గా ఉన్న పేర్లు మినహాయించి 2002 తర్వాత ఓటరుగా నమోదైన వారి వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి ధృవీకరించాల్సి ఉంటుందని అన్నారు. ఎస్.ఐ.ఆర్ నిర్వహణ పై మాస్టర్ ట్రైనర్ల ద్వారా బూత్ స్థాయి సిబ్బందికి సంపూర్ణ అవగాహన కల్పించాలని అన్నారు. కేంద్ర ఎన్నికల సంగం సూచన మేరకు బీహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇటీవల ఎస్.ఐ.ఆర్ చేయడం జరిగిందని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రిటర్నింగ్ అధికారి, ఏఈఆర్ఓ, డిప్యూటీ తహసిల్దారులు, బి.ఎల్.ఓ, సూపర్ వైజర్లుతో క్రమం తప్పక సమావేశాలు నిర్వహించాలని, ప్రతిరోజు లక్ష్యాలను నిర్దేశించుకోని ఎస్ఐఆర్ పూర్తి చేసేలా కార్యాచరణ తయారు చేయాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఇంచార్జి కలెక్టర్ పింకేష్ కుమార్, అదనపు కలెక్టర్ బెన్ష లోమ్, ఆర్డీవో, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Exit mobile version