మెదక్, మన ప్రజాపక్షం :వానాకాలం ధాన్యం కొనుగోళ్ళకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్ ప్రజావాణి హాల్ నందు అదనపు కలెక్టర్ నగేష్ వానాకాలం ధాన్యం కొనుగోలు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై వ్యవసాయ, పౌర సరఫరాలు, సహకార, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ, తూనికలు, కొలతల శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ 2025-26 సీజన్ కోసం రైస్ మిల్లర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఈ ఖరీఫ్ లో సుమారు 4.23 లక్షల టన్నుల వరి ధాన్యం కోనుగోలు కేంద్రాలకు రావటం జరుగుతుందని తెలిపినారు. ఇట్టి ధాన్యం జిల్లాలోని 503 ధాన్యం కొనుగోళ్ళు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయబడుతందని అన్నారు. ధాన్యాన్ని సమయానికి దిగుమతి చేయాలని, ధాన్యం దిగుమతికి అవసరమైన 10% బ్యాంక్ గ్యారంటీని మరియు అగ్రిమెంట్లును వెంటనే సమర్పించాలని సూచించారు. అలాగే మిల్లుల్లో బ్లెండింగ్ మరియు సార్టెక్స్ యంత్రాలను ఏర్పాటు చేయడం, ధాన్యం దిగుమతులు సజావుగా సాగేందుకు తగినంత హమాలీలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బంది కలుగకుండ ధాన్యంను వెంటనే దిగుమతి చేసుకోవాలని తెలిపినారు. ఖరిఫ్ఫ్ 2024-25 మరియు రబీ 2024-25 సి యం ఆర్ ను యఫ్ సి ఐ (ఎఫ్ సి ల్) కు ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు డెలివరీ చేయాలనీ సూచించారు. మరియు ఖరీఫ్ 2025-26 సీజన్ సాఫీగా సాగేందుకు మిల్లర్లు పూర్తి సహకారం
అందించాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ జిల్లా వ్యవసాయ అధికారికి, వ్యవసాయ అధికారులకు, సహాయ వ్యవసాయ అధికారులకు మరియు హర్వేస్టర్ యజమానులకు పలు సూచనలు చేశారు. (ఆర్ పీ యం) 18-20 లోపు ఉండాలని అలాగే బ్లోవేర్ ఎప్పటికీ ఆన్ లో ఉండాలని తెలిపినారు. మరి ముఖ్యముగా పంట పక్వానికి రాక మునుపు కోతలు కోయవద్దని తెలిపినారు అలా చేస్తే రవాణా శాఖా అధికారి లైసెన్స్ కాన్సుల్ చేస్తారని ఆదేశించారు మరియు రైతులకు ఇట్టి విషయంలో అవగాహన కలుగ జేయాలని జిల్లా వ్యవసాయ అధికారికి సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానందం, జిల్లా మేనేజర్ సివిల్ సప్లై కార్పొరేషన్ జగదీశ్, జిల్లా వ్యవసాయ అధికారి మరియు రవాణా శాఖ అధికారి టి.చంద్రపాల్, మెదక్ బాయిల్డ్ మిల్లర్స్ అధ్యక్షుడు, వీరేశం, రా మిల్లర్స్ అధ్యక్షుడు మరియు మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్ళకు పటిష్ట ప్రణాళికలు సిద్ధం చేయాలి