మంచిర్యాల, మన ప్రజాపక్షం :మంచిర్యాల అటవీశాఖ రేంజ్ అధికారి రత్నాకర్ రావు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని భీమారం మండల కేంద్రంలోని రాజలింగు కుటుంబానికి చెందిన ప్రైవేట్ కలప డిపోను సీజ్ చేశామని తెలిపారు. ఇటీవల రిజర్వ్ ఫారెస్ట్ లో 21 టేకు చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తున్న చింతల ప్రదీప్, మగ్గిడి జీవన్, చింతల రాజ్ కుమార్ లను అధికారులు పట్టుకున్నారు. వారు రాజలింగుకి కలప అమ్ముతున్నట్లు నేరం అంగీకరించారు. ఈ చెట్ల విలువ 86,426 రూపాయలు ఉంటుందని, ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు రేంజ్ అధికారి వెల్లడించారు. అయితే ముందస్తుగా కలప కొనుగోలు కేంద్రాన్ని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
వ్వక్తిగత కలప కొనుగోలు కేంద్రం సీజ్