కల్వకుర్తి, మన ప్రజాపక్షం :నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం జిల్లెల్ల గ్రామంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో మంజూరు అయిన సిసి రోడ్డు పనులకు జిల్లా ఎస్సి, ఎస్టీ మానిటరింగ్ & విజిలెన్స్ కమిటీ మెంబర్ జిల్లెల్ల రాములు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో ఇప్పటికే గ్రామంలో దాదాపు కోటిన్నర పైచిలుకు రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి గణనీయంగా పెరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, పేద వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళా మణులకు ఉచిత బస్సు సౌకర్యం, వడ్డీ లేని రుణాలు, మహిళా శక్తి క్యాంటీన్లు, రైతు భరోసా, రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ, రైతు కూలీలకు సంవత్సరానికి 12 వేల రూపాయల భృతి, రైతులకు పనిముట్ల సబ్సిడీ, ఉచిత రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం పంపిణీ, బతుకమ్మ దసరా కానుకగా మహిళా మణులకు 1600 రూపాయల విలువగల రెండు నాణ్యమైన చీరలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఎన్నో సంక్షేమ పథకాలను పేదల కోసం ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుందంటే దానికి కారణం కేవలం స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి తిరుపతి గౌడ్, దేవాలయ చైర్మన్ రవి గౌడ్, నాయకులు తాడెం మల్లయ్య, ఎముక మహేష్, పట్టపర్ల పాండు గౌడ్, కుమ్మరి శ్రీరాములు, యార సురేష్, కుమ్మరి సాయి, కొమ్మగోని జంగయ్య, పర్వత్ రెడ్డి, యార పర్శరాములు తదితరులు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎస్సి,ఎస్టీ మానిటరింగ్ & విజిలెన్స్ కమిటీ మెంబర్ జిల్లెల్ల రాములు