Site icon Mana Prajapaksham

పుట్టిన రోజున ఘనంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు బియ్యం పంపిణీ

పెద్దపల్లి, మన ప్రజాపక్షం :పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పెద్దల్లి మాజీ కార్పొరేటర్, న్యాయవాది తేజస్విని ప్రకాష్ జన్మదినాన్ని పురస్కరించుకొని కిడ్నీ రోగులకు బియ్యం పంపిణీ, అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా పేదలకు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తేజస్వి ప్రకాష్ మాట్లాడుతూ పుట్టినరోజు అంటే కేవలం ఉత్సవాలే కాదు సేవా కార్యక్రమాలు జరపడంలోనూ నేను ముందుంటా, సేవ చేయడం వల్ల మానసిక ఆనందాన్ని ఇస్తుందన్నారు. సమాజంలో పేద ప్రజలకు ఆపదలో ఉన్న వారికి అన్ని వర్గాల వారికి శుభకార్యముల సందర్భంగా సహాయాన్ని అందించి మానవత్వం చాటుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మద్దెల రాజేష్, వ్యాసాల శేఖర్, మంతెన నగేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version