జనగామ, మన ప్రజాపక్షం :బుధవారం జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సాదన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనైనది నిరసన కార్యక్రమం జిల్లా అద్యక్షుడు బి.లక్ష్మయ్య అద్యక్షతన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య మాట్లాడుతూ 2024 మార్చి నుండి రిటైర్ అయిన ఉద్యోగుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 18 నెలల నుండి బకాయిలు చెల్లించకుండా జాప్యం చేయడం వల్ల రాష్ట్రంలో రిటైర్మెంట్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయలు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని బకాయిలు చెల్లించకపోవడంతో పిల్లల పెండ్లి చేయలేక ఇల్లు కట్టుకోలేక,చేసిన అప్పులు తీర్చలేక బ్యాంకు ఈఎంఐలు చెల్లించలేక నానా ఇబ్బందులకు గురవుతూ ఆరోగ్యాన్ని బాగుచేసుకోలేని దయనీయ మైన స్థితిలో ఉన్నాము. బకాయిలు రాక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 26 మంది పెన్షన్ దారులు కృంగి పోయి అప్పులు బాదలు బరించలేక చనిపోవడం జరిగింది అన్నారు కార్యక్రమంలో సంఘీభావం తెలిపిన టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్, హరిబాబు TSGREA ప్రదాన కార్యదర్శి,అంబటి రాజయ్య తదితరులు పాల్గొని మాట్లాడతు ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగ ఉపాధ్యాయులకు వెంటనే బకాయిలను చెల్లించి పెన్షన్ దారుల చావులను ఆపాలని అన్నారు. గౌరవ అధ్యక్షుడు మిరియాల రమేష్ జిల్లా ప్రదాన కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మా బాదను మానవతాదృకపదంతో ఆలోచించి బకాయిలను వెంటనే చెల్లించి మాకుటుంబాలను ఆదుకోవాలి అని అన్నారు. జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. కార్యక్రమంలో కృష్ణ మూర్తి, రామచందర్, కుర్రెముల యాదగిరి, రవీందర్, చలపతి రెడ్డి, మూర్తి, శ్రీనివాస్, రాములు, కృష్ణమూర్తి దాదాపు 50 మంది పెన్షన్దారులు హాజరయ్యారు.
కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపిన రిటైర్డ్ ఉపాధ్యాయ సాధన కమిటీ




