నర్సాపూర్, మన ప్రజాపక్షం :మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని అగ్నిమాపక కేంద్రం సమీపంలో విద్యుత్ మరమ్మత్తు పనులు చేస్తుండగా సిబ్బందికి అనుకోకుండా విద్యుత్ షాక్ తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సహచరులు స్పందించి వారిని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన విషయం తెలుసుకున్న నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి గాయపడిన విద్యుత్ సిబ్బందిని పరామర్శించారు. బాధితులకు అత్యుత్తమ వైద్యసేవలు అందేలా సంబంధిత ఉన్నతాధికారులు మరియు వైద్యులతో ఆయన మాట్లాడారు. అవసరమైతే ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మానవత్వం చాటిన రాజీ రెడ్డి
Raji Reddy, who showed humanity