Site icon Mana Prajapaksham

డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతి చెందిన గర్భిణి

కల్వకుర్తి, మన ప్రజాపక్షం : నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు గర్భిణీ ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటు చేసుకుంది. నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోవడానికి కారణం వైద్యుల నిర్లక్ష్యమేనని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విరటి అంజలి అనే మహిళా డెలివరీ సమయం 14 రోజులు ముందుగానే సిజేరియన్ చేయడం వల్ల తీవ్ర సమస్యలు తలెత్తయని అన్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు దాదాపు 30 లక్షల రూపాయల వరకు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో మృతదేహంతో ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు.

Exit mobile version