ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే హెడ్ కానిస్టేబుల్ పై ఓ దుండగుడు కత్తితో దాడి చేసి పారిపోయిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే… నిర్మల్ జిల్లా కుభీర్ పోలీసుస్టేషన్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసిన దుండగుడు. నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో కత్తితో పోలీస్ స్టేషన్‌లోకి వచ్చిన వ్యక్తి…..నేరుగా ఎస్ఐ గదిలోకి వెళ్తుండగా హెడ్ కానిస్టేబుల్ టి.నారాయణ అడ్డుకోవడంతో ఆ దుండగుడు వెంటనే తన వద్ద ఉన్న కత్తితో ఆయన కడుపులో పైభాగంలో పొడవడంతో హెడ్ కానిస్టేబుల్ గాయలపాలయ్యారు. అక్కడే ఉన్న హోంగార్డు గిరిధారి అడ్డుకోవడానికి రాగా, బలంగా తోసేయడంతో అతని చేతులకు గాయాలు అయ్యాయి. వీరి అరుపులకు మిగతా సిబ్బంది, స్టేషన్ వెనుక క్వార్టర్లలోని పోలీసులు రావడంతో నిందితుడు పరరాయ్యడు. గాయపడిన నారాయణ, గిరిధారిలకు కుభీర్‌లో ప్రాథమిక చికిత్స అందించి, భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వ్యక్తి మహారాష్ట్ర ప్రాంతం నుంచి వలస వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.
తెలంగాణలో పోలీసులకే రక్షణ కరువు




