మఖ్తల్, మన ప్రజాపక్షం :రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే మహిళలకు 2500 రూపాయలు, వితంతు, వృద్ధ, వికలాంగులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్స్ పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది అని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కురుమయ్య గుర్తు చేస్తున్నాం అన్నారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇంతవరకు వాటి ఉసు ఎత్తకుండా పెన్షనర్స్ ను ఇబ్బందులకు గురిచేస్తుంది అని పేర్కొన్నారు. మహాజన సోషలిస్ట్ పార్టీ అనుబంధ సంస్థ ఎంఆర్పిఎస్, వికలాంగుల సమైక్య ప్రత్యక్ష కార్యాచరణ ఉద్యమాలకు అంబేద్కర్ యువజన సంఘం పూర్తి మద్దతు ఇస్తుంది అని పేర్కొన్నారు.
మ్యానిఫెస్టోలో ప్రకటించిన విదంగా పెన్షన్లు తక్షణమే పెంచాలి




