మహబూబ్ నగర్, మన ప్రజాపక్షం : అంబేద్కర్ కళాభవనం పరిరక్షణ సమితి కమిటీ ఆధ్వర్యంలో ఉర్దూ ఘర్ వద్దు కళాభవనము ముద్దు అనే అంశాన్ని గత మూడు నెలల నుండి ప్రజా ప్రతినిధులకు, ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఈరోజు విచారణకు రావడం జరిగింది. (అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ) శివేంద్ర ప్రతాప్, అర్బన్ ఎమ్మార్వో గన్షిరామ్ ,మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, జెడ్పి సిఈఓ మరియు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఇన్చార్జి వెంకట్ రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ డిడి శంకరాచారి, సోషల్ వెల్ఫేర్ డిడి సునీత, ఆర్ఐ సుదర్శన్ రెడ్డి, ఏఎస్డబ్ల్యూ సుదర్శన్, అధికారులు వచ్చి అంబేద్కర్ కళాభవన ప్రాంగణాన్ని సందర్శించి పరిశీలన చేసి బీసీ,ఎస్సీ,ఎస్టీ సంఘాల ప్రతినిధుల సమక్షంలో విచారణ జరిపినారు. దళిత సంఘాల ప్రతినిధులు ముక్తకంఠంతో కళాభవనం ముద్దు ఉర్దూగర్ వద్దు అనే ముక్తకంఠాన్ని అయిన దృష్టికి తీసుకెళ్లారు. మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు ముస్లిం ప్రజలు ఆలోచన చేయాలని తెలియజేస్తున్నాం. కొందరు రాజకీయ నాయకులు కావాలని మన మధ్య అభిప్రాయాలు తేవడానికి ముందుకు తీసుకువచ్చి మనకు ఐక్యత లేకుండా చేస్తున్నారు. డాక్టర్ అంబేద్కర్ కళాభవన్ పరిరక్షణ సమితి చైర్మన్ సింగిరెడ్డి పరమేశ్వర్, రాయి కంటి రాందాస్, సలహాదారులు, కన్వీనర్ పాతూరు రమేష్,డాక్టర్ ఉష్కిల్లా వెంకట్ రాములు, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, ఆది రవీంద్రబాబు,ఎం బాలయ్య, గుమ్మడాల చంద్రశేఖర్,మాజీ ఎస్సీ ఎస్టీ మెంబర్స్, జోగు బాలరాజు, గంధం నాగరాజు,మల్లె పోగు శ్రీనివాస్, ఎస్సి, ఎస్టీ, బీసీ సంఘాల ప్రతినిధులు డాక్టర్ నాగయ్య,సారంగి లక్ష్మీకాంత్, ఎక్స్ ఆర్మీ బాలరాజు, మైత్రి యాదయ్య, గోనెల శ్రీనివాసులు, యాదగిరి నాయక్, ఎక్స్ ఆర్మీ శాంతయ్య, పాతపాలమూర్ మాజీ కౌన్సిలర్ శ్రీనివాసులు, ఎల్. రమేష్, యాంకి రమేష్, గడ్డమీది గోపాలకృష్ణ, రాజగాని అశోక్, కాలే నరేందర్, ఎర్ర నరసింహ బిసి కో..కన్వీనర్ నాయకులు, బాలరాజ్ నాయకులు,మహిళా విభాగం శ్రీవల్లి, కృష్ణ, పీ.కొండయ్య, డి. బాలన్న, ధన్వాడ రాములు, పి.బాలయ్య, శ్రీరాములు, ఎన్. రాములు, ఎం. వెంకట రాములు, చేక్కల దినేష్, పడకంటి యాదగిరి, కే.వినయ్ కుమార్, రంగస్వామి, మొలకలపల్లి గోపాల్, ఆది విష్ణు, పి.వేణుగోపాల్, రావుల కృష్ణ, కాలేనరేందర్, నాగయ్య, వేముల కొండన్న, సంజీవ్, శిరసని నర్సింహా, నాగేష్, జగజీవన్ రామ్, కే.తిరుమలయ్య, హన్వాడ రాములు, కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ కళాభవన్ పై విచారణ చేపట్టిన అధికారులు