నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని నాట్వర్ నృత్య మరియు సంగీత కళాక్షేత్రం నుండి 8మంది విద్యార్థులు తేది: 24-12-2023 నాడు భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో గచ్చిబౌళి స్టేడియం నందు సామూహికంగా నిర్వహించిన కూచిపూడి నృత్యం నందు పాల్గొనందుకు గాను గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ ను 8 మంది విద్యార్థులలో ఒకరైన కీర్తిశేషులు కపిలవాయి లింగమూర్తి మనవరాలైన లాస్య ప్రియ తండ్రి కపిలవాయి ఆనంద వర్ధన్ ను జిల్లా కలెక్టర్ భవనం నందు ఎంపి మల్లు రవి మరియు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అభినందించి వారి చేతుల మీదుగా సర్టిఫికెట్ అందించారు. ఈ కార్యక్రమంలో నృత్య గురువు ఎ.శ్రావణి, ఎ.సునీత, కో ఆర్డినేటర్, పిల్లల తల్లిదండ్రులు రాధరాణి తదితరులు పాల్గొన్నారు.
నాట్వరు నృత్య, సంగీత కళాక్షేత్రం విద్యార్థులు గిన్నిస్ వరల్డ్ రికార్డ్