Site icon Mana Prajapaksham

జాతీయ రహదారుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

జనగామ, మన ప్రజాపక్షం: జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగవంతం చేయుటలో అవసరమైన భూ సేకరణ ప్రక్రియను జాప్యం లేకుండా సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుతో కలిసి జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులకు అవసరమైన స్థల సేకరణ వంటి పలు అంశాలపై   డా.బిఆర్.అంబేడ్కర్ సచివాలయం నుండి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. దసరా పండుగకు ముందే అన్ని పనులు పూర్తి కావాలని సీ.ఎం స్పష్టం చేశారు. కోర్టు కేసులకు సంబంధించిన  వివరాలను  ప్రభుత్వానికి పంపాలన్నారు. రహదారి నిర్మాణ పనులలో జాప్యం జరుగకుండా భూసేకరణలో ఎలాంటి ఆలస్యం జరుగకూడదన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం రాష్ట్ర అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఇంచార్జి కలెక్టర్ పింకేష్ కుమార్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్ షాలోమ్, జనగామ ఆర్డిఓ గోపి రామ్, ఆర్ అండ్ బి ఈఈ  స్వరూప రాణి, మైనింగ్ అధికారి విజయ్ కుమార్, ఎఫ్ ఆర్ వో కొండల్ రెడ్డి, జాతీయ రహదారుల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version