Site icon Mana Prajapaksham

యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడుగా నామత్కర్ నవీన్



నిర్మల్, మన ప్రజాపక్షం :భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలు నిజామాబాద్ పట్టణంలో ఈనెల 25,26,27 తేదీల్లో ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభల్లో
నిర్మల్ జిల్లాకు చెందిన జిల్లా కార్యదర్శి నామత్కర్ నవీన్ ను  విద్యార్థి ఉద్యమాలను గుర్తించి తన సేవలను రాష్ట్రవ్యాప్తంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర కమిటీ సభ్యునిగా  నియమించారు. నియామకం అనంతరం నామత్కర్ నవీన్ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన యుఎస్ఎఫ్ఐ కేంద్ర,రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న రోజుల్లో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తూ సంఘ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ గురుకులలకు సొంత భావనాలు వెంటనే ప్రారంభించాలని కోరడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడిచిపోతున్న ఇక్కడ సమస్యలు అక్కడనే ఉండడం చాలా బాధాకరమైన విషయం అని అన్నారు. సాధారణ కార్యకర్త నుంచి రాష్ట్రస్థాయి వరకు ఎదిగిన నవీన్ నీ వివిధ విద్యార్థి సంఘాలు మరియు గ్రామస్తులు అభినందించారు.

Exit mobile version