Site icon Mana Prajapaksham

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ముచ్చర్ల జనార్దన్ రెడ్డి

మిడ్జిల్, మన ప్రజాపక్షం :నిరుపేద కుటుంబానికి అండగా బిజెపి రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి ఆర్థిక సాయం అందజేశారు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సంపంగి రాఘవేందర్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. ఇట్టి విషయం బిజెపి పార్టీ మిడ్జిల్ మండల కార్యదర్శి నరేష్ ద్వారా తెలుసుకున్న బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు, నాగర్ కర్నూల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కరాటే అసోసియేషన్ చైర్మన్ ముచర్ల జనార్దన్ రెడ్డి తక్షణ సహాయం కింద 5000 రూపాయలు ఆర్థిక సహాయం వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల, గ్రామ నాయకులు,కుటుంబ సభ్యులు ఉన్నారు.

Exit mobile version