Site icon Mana Prajapaksham

ఇందిరమ్మ ఇండ్ల సమస్యలపై జిల్లా గృహనిర్మాణ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

అచ్చంపేట, మన ప్రజాపక్షం :నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ మండలాల పరిధిలోని గ్రామాలలో నూతనంగా నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల యొక్క సమస్యలు మొదలైన అంశాలపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ హౌసింగ్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీ కృష్ణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిఈ, ఏఈ అన్ని మండలాల ఎంపీడీవోలు హాజరయ్యారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఎటువంటి సమస్యలు లేకుండా త్వరగా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version