Site icon Mana Prajapaksham

ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

మామడ, మన ప్రజాపక్షం :నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ పోరాట పటిమను నేటి యువత స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలో కొమురం భీం విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంనాథ్, మెడిసెమ్మ రాజు, బాపు రెడ్డి, సాహెబ్ రావ్, నవీన్, ముత్యం రెడ్డితో పాటు మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version