Site icon Mana Prajapaksham

ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దురుసు ప్రవర్తన – కేసు నమోదు

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :నాగర్‌కర్నూల్ పట్టణంలో అడ్డంగా నిలిపిన కారు తరలించమని చెప్పిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై డ్రైవర్ దురుసుగా ప్రవర్తించిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నాగర్‌కర్నూల్ ట్రాఫిక్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ ఫాజిల్ విధి నిర్వహణలో భాగంగా రోడ్డుపై అడ్డంగా పార్క్ చేసిన కారు యజమాని హాసన్ (నాగర్‌కర్నూల్) ను కారు పక్కకు తీయమని సూచించారు. అయితే హాసన్ వారి ఆదేశాలను పాటించకపోగా, కానిస్టేబుల్ పై దురుసుగా ప్రవర్తించి, బూతు మాటలు మాట్లాడి ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించాడు. ఈ ఘటనపై పోలీసుల ఆదేశాల మేరకు హాసన్‌పై ఎస్సై – 2 వినోద్ కుమార్ కేసు నమోదు చేశారు. పోలీసుల పట్ల దురుసు ప్రవర్తన, విధి నిర్వహణకు అడ్డంకులు కలిగిస్తే తగిన చర్యలు తప్పవని జిల్లా పోలీసులు హెచ్చరించారు. రోడ్లపై ట్రాఫిక్ సిబ్బందిని సహకరించాలని, నియమ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ విభాగం స్పష్టం చేసింది.

Exit mobile version