సూర్యాపేట, మన ప్రజాపక్షం :మహాలయ అమావాస్య సందర్భంగా వాసవి,వనిత క్లబ్ అధ్యక్షురాలు మిట్టపల్లి శ్రీదేవి ఆధ్వర్యంలో దాతల సహకారంతో 500 మందికి ఆదివారం కొత్త బస్టాండ్ ఆవరణలో అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాసవి,వనిత క్లబ్ అధ్యక్షురాలు మిట్టపల్లి శ్రీదేవి మాట్లాడుతూ మహాలయ పితృపక్షాల్లో అన్న ప్రసాద వితరణ చేయడం చాలా విశేషం అని పితృదేవతల ఆశీస్సులు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఇసి ఆఫీసర్ సింగిరికొండ రవీందర్, క్యాబినెట్ సెక్రటరీ బికుమల్ల కృష్ణ, ట్రెజరర్ వెంపటి శబరినాథ్, ఐపిసిపబ్బతి వేణుమాధవ్, గుండా ఉపేందర్, గుండా శ్రీధర్, గుడుగుంట్ల విద్యాసాగరూ, రాచకొండ శ్రీనివాస్, డిస్టిక్ ఇంచార్జ్ గో సేవ మిట్టపల్లి రమేష్, సీఎంఆర్ డిస్ట్రిక్ట్ ఇన్చార్జి కలకోట లక్ష్మయ్య, ఆర్ సి తోణుకునూరి సంతోష్ జెడ్ సి బుద్ధ శ్రీనివాస్ గుప్తా, బుద్ధ భాను తేజ, సెక్రటరీ భవాని, ట్రెజరర్ లకుమారపు పద్మజ, రాములు, కలకోట అనిత, ఊర్మిళ మొదలగు వారు పాల్గొన్నారు.
వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో మహాలయ అన్న ప్రసాద వితరణ