Site icon Mana Prajapaksham

గాంధీజీ కలలుగన్న భారతదేశ నిర్మాణం కోసం కృషి చేద్దాం

నాగర్ కర్నూల్, మన ప్రజాపక్షం :మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా మున్సిపల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ లో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ సత్యం, అహింస మానవతా విలువలకు మూలాధారం అని, ఈ సిద్ధాంతాలను పాటిస్తే సమాజంలో మార్పు తప్పక సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు.గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, సమానతా సమాజం కోసం ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. గాంధీజీ చూపిన మార్గంలో నడిచి ఆయన కలలుగన్న భారతదేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తించాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version