తన అటవీ శాఖ అధికారులతో వివేక్ భేటీపై సీఎంవోకు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. ఉపాధి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తనకు సమాచారం ఇవ్వకుండా తన అటవీ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడంపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2-3 రోజుల క్రితం ఈ సమావేశం జరిగినట్టు అటవీ శాఖ అధికారుల ద్వారా తెలుసుకున్నానని అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీఎంవోలో ఫిర్యాదు చేశారు మంత్రి కొండా సురేఖ.
మంత్రి వివేక్ వెంకటస్వామిపై కొండా సురేఖ ఫిర్యాదు