Site icon Mana Prajapaksham

కేజీబీవీ నాన్ టీచింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి

నారాయణపేట, మన ప్రజాపక్షం :కేజీబీవీలలో పనిచేస్తున్న వర్కర్లను, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ మొత్తాన్ని పర్మనెంట్ చేయాలని, వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు జీతం ఇవ్వాలని పిఎఫ్, ఈఎస్ఐ గ్రాటియిటి చట్టాలు అమలు చేయాలని కోరుతూ చలో హైదరాబాద్ కార్యక్రమానికి నారాయణపేట జిల్లాలో పనిచేస్తున్న వర్కర్లందరూ కదిలి రావాలని తెలంగాణ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బి.నరసింహ పిలుపు నిచ్చారు. 2006లో ప్రారంభమైన కేజీబీవీ పాఠశాలలో నాన్ టిచింగ్, విద్యార్థినిల విద్యాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న పని చేస్తున్న వారికి మాత్రం వాళ్ళ బతుకులు చీకటి కమ్ముకున్నావని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా కేజీబీవీలో పనిచేస్తున్న సిబ్బంది గురించి మాట్లాడడమే తప్ప ఆచరణలో వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పించడం లేదన్నారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అధికారంలో లేన్నప్పుడు కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ ను పర్మినెంట్ చేస్తున్న హామీ ఇచ్చిండు వెంటనే ఆ హామీని నెరవేర్చలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. భవిష్యత్తులో మరింత పోరాటాలు తీవ్రంగా చేయాల్సి వస్తుందని అవసరం వస్తే కేజీబీవీ వ్యవస్థని స్తంభింపచేయవలసి వస్తుందని ప్రభుత్వానికి హెచ్చరించారు. రేపు హైదరాబాదులో ఎస్పిడి కార్యాలయానికి కేజీబీవీ నాన్ టీచింగ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Exit mobile version