Site icon Mana Prajapaksham

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

బైంసా, మన ప్రజాపక్షం :నిర్మల్ జిల్లా భైంసాలోని విశ్రాంతి భవనం ముందర రజకులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలోచాకలి ఐలమ్మ జయంతి సందర్బంగా ఐలమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకేట మహేష్ బాబు మాట్లాడుతూ ఐలమ్మ జీవిత చరిత్రను పూర్తి స్తాయిలో పాఠ్యాంశంగా చేర్చాలన్నారు. ప్రభుత్వం ఈ రోజు సెలవు దినంగా ప్రకటించాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఐలమ్మ చిత్రపటం లేదు వెంటనేప్రజల ఏర్పాటు చేయాలన్నారు. భూమికోసం ప్రజల విముక్తి కోసం పోరాడిన తల్లిని తెలంగాణ తల్లిగా గుర్తింపును ఇవ్వాలని డిమాండ్ చేశారు.రజకుల చిరకాల వాంఛ రజకులను ఎస్సి జాబితాలో చేర్చాలని కోరారు. దొరలను భూస్వాములను తరిమి కొట్టి 10 లక్షల ఎకరాల భూమిని పంచిన మహనీయురాలని గుర్తుచేశారు. ఐలమ్మ ఆశయ సాధన కోసం అందరు క్రుషి చేయాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు శ్రీనివాస్, సాయినాథ్, భూమన్న, రాజు, ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు నందు,ఆనంద్, సాయి చంద్ ఆనంధిత ఫౌండేషన్ చైర్మన్ వాడేకర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version