Site icon Mana Prajapaksham

మహబూబ్‌నగర్ జిల్లాలో రెచ్చిపోతున్న గంజాయి గ్యాంగ్

మహబూబ్ నగర్, మన ప్రజాపక్షం :డబ్బుల కోసం పాలిటెక్నిక్ విద్యార్థిపై దాడి చేసిన ఘటన నాలుగు రోజులైనప్పటికి పోలీసులు వారిని అరెస్టు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌ మండలం అన్నాసాగర్ గ్రామంలో నివాసముంటూ,మహబూబ్‌నగర్ పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్న సాయికుమార్(19) అనే యువకుడు.ఎప్పటిలాగే కళాశాల నుండి స్వగ్రామానికి వస్తుండగా రోడ్డుపై గంజాయి సేవిస్తూ డబ్బులు ఇవ్వాలని యువకుడిని పోకిరిలు ఇబ్బంది పెట్టడంతో తన వద్ద డబ్బులు లేవని చెప్పాడు సాయికుమార్. 40 రూపాయలు కూడా లేవా అంటూ అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు గంజాయి గ్యాంగ్. సాయికుమార్ తీవ్ర రక్తస్రావంతో ఇంటికి వెళ్లగా చికిత్స నిమిత్తం యువకుడిని ఆసుపత్రికి తరలించారు అతని తల్లిదండ్రులు. యువకుడి ప్లీహము పూర్తిగా దెబ్బ తినడంతో ఆపరేషన్ చేసి తొలగించారు వైద్యులు. గంజాయి గ్యాంగ్ పై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో పట్టణంలోని పలువురు మేధావులు పోలీసులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version