మక్తల్, మన ప్రజాపక్షం :నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో మహాత్మా గాంధీ జయంతిని పురష్కరించుకుని జనసేనపార్టీ ఇంచార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్ అద్వర్యంలో మహాత్మాగాంధి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా డాక్టర్ మణికంఠ గౌడ్ మాట్లాడుతూ … మన జాతిపిత మన దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఎన్నో ఉద్యమాలు చేశారు. ఉప్పు సత్యాగ్రహం, చంపారన్ క్విట్ ఇండియా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉద్యమాలు శాంతితోనే చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకరావడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. సత్యం -అహింసా-శాంతి అనే నినాదంతో ముందుకు వెళ్లి భారతీయులందరినీ ఏకతాటి పైకి తెచ్చి ఉద్యమాన్ని ముందు ఉండి నడిపి బ్రిటిష్ వాళ్లను పారద్రోలి భారతదేశానికి స్వాతంత్ర్య సమరయోధులతో పాటు కలిసి స్వాతంత్ర్యం సంపాదించారు.అలాంటి గొప్ప వ్యక్తి జన్మదినాన్ని మనమందరం పండగల జరుపుకోవాలని అన్నారు. జనసేన తరపున దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు రామన్ గౌడ్,
గౌడి బాల్ రెడ్డి, శివప్రసాద్, భీమేష్, ఆంజనేయులు, కృప సాగర్, శివ మరియు నర్సిములు తదితరులు పాల్గొన్నారు.
జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు