Site icon Mana Prajapaksham

ఆరోగ్య వైద్య మరియు వ్యాధి నిర్దారణ పరీక్ష క్యాంప్ కు విశేష స్పందన

మహబూబ్ నగర్, మన ప్రజాపక్షం : శ్రీ అక్షర హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు అక్షర ఇనిస్టి ట్యూట్ అఫ్ మెడికల్ టెక్నాలజీ వారు సంయుక్తంగా నిర్వహించిన ఉచిత హెల్త్ క్యాంప్ మరియు ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్ష శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరం ద్వారా 152 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగిందని అక్షర ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ టెక్నాలజీ కరెస్పాండంట్ సునయ పర్వీన్ తెలియజేశారు. విద్యార్థుల మేధస్సును పెంచే విదంగా ప్రాక్టికల్ నాలెడ్జి అభివృద్ధికి తోడ్పాటుకు ఇలాంటి క్యాంపులు ఎంతో దోహదహా పడతాయని మైక్రోబయాలజీస్ట్ రవి కుమార్ తెలియజేశారు. పరీక్షలు చేయించుకోడానికి వచ్చిన జనాలు ఉత్సాహంగా పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ ఉచిత మెగా క్యాంపు ద్వారా బిపి, షుగర్, రక్త పరీక్షలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ అక్షర హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ అజారుద్దీన్, ట్రెజరర్ రిజ్వనా పర్వీన్ అదేవిదంగా శ్రీ హర్ష హాస్పిటల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ మురళి, డాక్టర్ షైనీ అక్షర పారామెడికల్ కాలేజ్ సిబ్బంది రవి కుమార్ ఇర్ఫాన్, ఆదిల్ జాహేద్, శ్రీజ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version