సన్రైజ్ గ్లోబల్ స్కూల్ లో ముందస్తు బతుకమ్మ సంబురాలు

మహబూబ్ నగర్, మన ప్రజాపక్షం :భూత్పూర్ మండల కేంద్రంలోని అన్నాసాగర్ గ్రామంలో గల సన్రైజ్ గ్లోబల్ స్కూల్ లో సెప్టెంబర్ 20వ తేదీన బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ సుమలత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ పండుగలలో అతిపెద్ద పండుగ అయిన దసరా పండుగను పురస్కరించుకొని విజయదశమి కన్నా ముందుగా వచ్చే దేవి నవరాత్రుల సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించుకుంటారని, ఈ సందర్భంగా సన్ రైజ్ గ్లోబల్ స్కూల్ లో ముందస్తు బతుకమ్మ సంబురాలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. సెప్టెంబర్ 21వ తేదీ నుండి అక్టోబర్ 3 వ తేదీ వరకు ప్రభుత్వ ఆదేశానుసారం సెలవులు ప్రకటించామని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రిన్సిపాల్ సుమలత, ఉపాధ్యాయ బృందం మంజుల, స్నేహ, అరుణ, అనిత, సుహాసిని, శివలీల క్రింది స్థాయి సిబ్బంది ఖాదర్, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.

Mana Praja Paksham Desk
Mana Praja Paksham Desk
Articles: 224

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *