భూత్పూర్, మన ప్రజాపక్షం :భూత్పూర్ మండల కేంద్రంలోని కర్వేన గ్రామంలో గల మదర్ థెరిసా యూపీ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ సంబరాలలో భాగంగా చిన్నారులు తమ ఆటపాటలతో, కోలాటాలతో అందరినీ అలరించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి అందరూ విద్యార్థులు బొడ్డెమ్మలను వేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సంధ్యారాణి మాట్లాడుతూ తెలంగాణలో విజయదశమి పండుగను పురస్కరించుకొని విజయదశమి,దేవి నవరాత్రుల సందర్భంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చందు మాట్లాడుతూ మదర్ తెరిసా యూపీ స్కూల్ లో ముందస్తు బతుకమ్మ సంబురాలు విద్యార్థుల తల్లిదండ్రులతో విద్యార్థులతో ఘనంగా నిర్వహించుకున్నామని, సెప్టెంబర్ 21వ తేదీ నుండి అక్టోబర్ 3 వ తేదీ వరకు ప్రభుత్వ ఆదేశాలానుసారం సెలవులు ప్రకటించామని, ఈ సందర్భంగా పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబురాలు నిర్వహించామని వారు తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణి, కరస్పాండెంట్ చందు, ఉపాధ్యాయ బృందం మౌనిక, వినోద, మంజుల, హనీఫా బేగం, విజయ, నవీన, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
మదర్ థెరీసా పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు




